టెలిఫోనిక్ ఇంటర్వ్యూ.. చక్కగా వింటే 'ఉద్యోగం' మీదే!

ఉద్యోగ ఎంపికల్లో భాగంగా.. సమయాన్ని, వ్యయాన్ని తగ్గించుకోవడానికి చాలా సంస్థలు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ పద్ధతిని అవలంభిస్తున్నాయి. అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలవడానికి ముందుగానే.. ఒకసారి ఫోన్‌లో వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఫోన్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే.. తదనంతరం తుది ఇంటర్వ్యూలకు పిలుస్తున్నాయి. ఇలా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా మొదటిదశ ఎంపిక ప్రక్రియను పూర్తిచేస్తున్నాయి. మరి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఫోన్ ఇంటర్వ్యూలో నెగ్గాలంటే.. ఈ సూచనలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.. ➦ అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు.. మీరు తగిన అభ్యర్థి అని భావిస్తేనే ఆ సంస్థ మిమ్మల్ని ఫోన్‌లో ఇంటర్వ్యూ చేస్తుంది. కాబట్టి ఫోన్‌లో మాట్లాడేటప్పుడే వారితో ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. ➦ ఇంటర్వ్యూ చేసే అభ్యర్థిని మనం చూడలేం కాబట్టి.. మనం చెప్పే జవాబులకు వారి స్పందన ఏంటో అనేది తెలియదు. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ➦ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చేప్పే విషయాన్ని నిశితంగా వినాలి, స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. లేకపోతే పొంతనలేని సమాధానాలు చెప్పే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇంటర్వ్యూపై మీకు ఆసక్తి లేదు అనే భావన కలిగే ప్రమాదం కూడా ఉంది. ➦ ఫోన్‌ ఇంటర్వ్యూ చేసే సమయాన్ని సంస్థ ముందే అభ్యర్థికి తెలియజేస్తుంది కాబట్టి.. ఆ సమయానికి మీ మొబైల్‌ ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. ➦ ప్రశాంత వాతావరణంలో.. చుట్టుపక్కల ఎలాంటి శబ్డాలు లేకుండా, ఫోన్ సిగ్నల్స్‌ స్పష్టంగా ఉండేలా ఇంటర్వ్యూ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ సమీపంలో ఏమైనా ఎలక్ట్రానిక్ పరికరాలను, ఇతర ఫోన్లు స్విచాఫ్ ఉండేలా చూసుకోవాలి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో మాట్లాడేటప్పుడు.. కాల్ వెయిటింగ్ బీప్ శబ్దాలు రాకుండా ముందే సెట్టింగ్స్ చేసుకోవాలి. 'ఊ' కొట్టకండి.. మాట్లాడండి.. ఇంటర్వ్యూయర్‌తో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు.. ఊ కొట్టడం. మ్.. ఆ.. అంటూ హమ్మింగ్ చేయకూడదు. ఇలా చేయండం వల్ల అభ్యర్థిపై నెగిటివ్ ఫీలింగ్ కలిగే అవకాశం ఉంది. ఒకవేళ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సమయం కావాల్సి వచ్చినప్పుడు.. అదే విషయాన్ని ఇంటర్వ్యూయర్‌కు చెప్పడం ఉత్తమం. అన్ని సిద్ధంగా ఉంచుకోవాలి.. ➦ ఫోన్ ఇంటర్వ్యూ ప్రారంభం కాకముందే.. అభ్యర్థి తనకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్లను, డాక్యుమెంట్లను, ఇతర అవసరమైన అన్ని పత్రాలను దగ్గరగా ఉంచుకోవాలి. ఒకవేళ ఇంటర్వ్యూయర్ ఏమైనా ప్రశ్నలు అడిగితే.. సులభంగా సమాధానం చెప్పవచ్చు. ➦ ఏదైనా సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా చెప్పాల్సి ఉంటే.. ముందుగానే కంప్యూటర్ ఆన్ చేసి.. ముఖ్యమైన ఫోల్డర్లను ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. దీనివల్ల చివరిక్షణంలో గందరగోళ పరిస్థితి ఏర్పడదు. ఇలా చేయకండి.. ➦ ఇంటర్వ్యూయర్‌తో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు హెడ్ ఫోన్ వాడటం ఉత్తమం. దీనివల్ల అవతలి వ్యక్తి చెప్పే మాటలు స్పష్టంగా వినిపిస్తాయి. అభ్యర్థి చెప్పేది కూడా ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి స్పష్టంగా వినిపిస్తుంది. ➦ ఇంకో ముఖ్య విషయమేమిటంటే.. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎట్టి అంతేకాని లౌడ్ స్పీకర్ ఆన్ చేయకూడదు. ➦ ఫోన్ ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల ప్రాథమిక వడపోత అని గుర్తుంచుకోవాలి.. ఇందులో చూపే ప్రతిభ ఆధారంగానే తదుపరి పరీక్షకు అనుమతించాలా వద్దా అని ఆధారపడి ఉంటుంది. అందుకే ఫోన్ ఇంటర్వ్యూల్లో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి అవసరం. Read More..➦ ➦


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2Wp363m

Comments