గురు విశ్వస్ఫూర్తి.. ఆధ్యాత్మిక, భౌతిక జీవితాలను ఎలా కలపాలో నేర్పిన రియల్ గురు

నాణేనికి బొమ్మ, బొరుసు మాదిరిగా మనిషికి కూడా భౌతిక, ఆధ్యాత్మిక జీవితం రెండూ ఉంటాయి. మనం ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి వరకు ఏవైతే యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో అది భౌతిక జీవితం. నిద్ర లేచింది మొదలు రకరకాల వ్యాపకాలు, మానసిక ఒత్తిడులు, టెన్ష‌న్‌తో సమాజం ఉరుకులు పరుగుల జీవనం సాగిస్తోంది. ఎవరి దారిలో వాళ్లు వేగంగా వెళ్లిపోతూ ఉంటారు. రెండోది ఆధ్యాత్మిక జీవితం. అది మనలోనే దాగి ఉండి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నా మనం గుర్తించకలేకపోయిన న చిన్న అణువు లాంటిది. అణువే అయినా దాన్ని చూడటం అంత తేలిక కాదు. దీన్ని కనుక్కోలేకపోతే, భౌతిక, ఆధ్యాత్మికతలు ఏకకాలంలో పనిచేయలేకపోతే జీవితం ఒకే వైపు బరువున్న త్రాసులా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా దీన్ని తెలుసుకోవటం? పరిపూర్ణ జీవితాన్ని ఎలా గడపటం? భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలను ఎలా కలపాలో, ఏ మేరకు పాటించి జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలో చెప్పి నిజమైన జ్ఞానాన్ని అందించేవారే రియల్ గురు. గురువు ఒక శిల్పి వంటి వాడు. మంచి గురువు చేతిలోమలచబడేవారు ఉత్తమమానవులై ,సంస్కారవంతులై ,సమాజానికి ఉపయోగపడతారు. ఎవరైతే మానవ జీవన ప్రస్థానంలో నిజమైన మేథస్సు, తెలివి, నిజమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారో వారే నిజమైన గురువులు. అలాంటి మహనీయులే ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్………… . మానవత్వం – మేధస్సుల మేలి మేళవింపుతో, దానికి ఆధ్యాత్మిక చేరికతో మానవ జీవితాన్ని మహొన్నతస్థితికి ప్రస్థానింపజేయడానికి ఆయన ‘ధ్యానమనోప్రస్థానమ్’ మార్గాన్ని ప్రవేశపెట్టారు. లక్షలాదిమంది భక్తులకు ఆప్తమిత్రునిగా, ఆత్మబంధువుగా ఆరోగ్యప్రదాయిగా యోగక్షేమ రక్షకుడిగా గురు విశ్వస్ఫూర్తి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విశేష ప్రాచుర్యం పొందారు. వారి ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాల వల్ల వేలాది మంది ప్రయోజనం పొందుతున్నారు. మెడికల్ క్యాంపులు, సమాజ సేవా కార్యక్రమాలు, యువతకు జీవనోపాధి శిక్షణ అందిస్తూ లక్షలాదిమంది జీవితాలలో వెలుగులు ప్రసరింపజేశారు. మార్పు కోసం దురాచారాలను దునుమాడుతూనే హైందవ ధర్మం మానవాళికి అందజేసిన గొప్ప సూత్రాలను హేతుబద్ధంగా, శాస్త్రబద్ధంగా వివరిస్తూ లక్షలాదిమంది జీవితాలలో ప్రకాశవంతమైన మార్పును తీసుకువచ్చారు. జీవనశైలి మార్పు ద్వారా జీవితాన్ని సుసంపన్నం చేసుకునే మార్గాన్ని అందించారు. రెలిజియస్ హ్యూమనిజం, సైంటిఫిక్ యోగా ఆయన మానవాళికి అందించిన గొప్ప వరాలు. సనాతన యోగాను, నేటి జీవన స్థితిగతులకు, శారీరక నిర్మాణాలకు అనుగుణంగా మార్పు చేసి సైంటిఫిక్ యోగాతో అందరి జీవితాలలో ఓ క్రమశిక్షణను, ఆరోగ్యాన్ని, ఫ్రశాంతతను పంచారు. మనిషి-సమాజం- దేవుడు వీటి మధ్య తప్పనిసరిగా ఉండవలసిన అనుబంధాన్ని రెలిజియస్ హ్యూమనిజం పేరుతో ఆయన ఆవిష్కరించారు. మనిషిలోని మానవత, దేవుడిలో ఉందనుకునే దివ్యత, రెండిటగి మధ్య ఉండవలసిన అవినాభావ సంబంధాన్ని ఆయన ఆవిష్కరించారు. ఉన్నతమైన జీవన విధానం: నిరక్షరాస్యులకు కూడా తేలికగా అర్థం అయ్యేలా సులభమైన జీవన విధానాలను ఆయన ఆవిష్కరించారు. దీనిలో ప్రధానమైనది ధ్యాన మనో ప్రస్థాన మార్గం. ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో మార్పు తీసుకురావచ్చని ఆయన నిరూపించారు. పరిపూర్ణమైన జీవితాన్ని అందించే సమూల మార్పుల కోసం ఆయన అనేక సైంటిఫిక్ విధానాలను ఆవిష్కరించారు. ఇవి లక్షలాదిమందిని ప్రభావితం చేశాయి. ఇంకా చేస్తున్నాయి. గురుమార్గం: తోటివారికి సాయం అందిస్తూ మన జీవితాలను పూర్తిగా మార్చుకోగల అద్భుత అవకాశాన్ని ధ్యాన మనో ప్రస్థాన కేంద్రాల ద్వారా ఆయన అందజేస్తున్నారు. ధ్యానం ద్వారా మనసుకు అంతర్ముఖ దృష్టి కలుగుతుంది. అలాంటి ధ్యానాన్ని సరైన పద్ధతిలో చేస్తూ ఆసన ప్రాణాయామ, ధ్యాన ప్రక్రియలను ఆచరిస్తూ మనోప్రస్థాన మార్గంలో ముందుకెళ్లేలా లక్షలాదిమందికి ఆయన స్పూర్తినిస్తున్నారు. అద్భుత ఆధ్యాత్మిక ప్రయోగమైన మీడియం విధానంతో నిరంతరం ఆయన తనను నమ్మినవారికిచేరువగా ఉంటూ వారిని సరైన మార్గంలో నడిపిస్తూ గురుబ్రహ్మ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2C9mxad

Comments