జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా పేదలకు లబ్ది చేకూరేలా కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తాజాగా పేదల కోసం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.. బియ్యం కార్డు ఉండి కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేయనుంది. ముఖ్యంగా పేదల కోసం ఈ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. గతంలో ఎల్ఐసీతో కలసి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేది. కానీ దీనిని కొద్ది రోజుల క్రితం ఉపసంహరించుకుంది. అయితే పేదల కోసం ఈ పథకాన్ని పూర్తిగా సొంత నిధులతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 1.50 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయనుంది. బియ్యం కార్డుదారుల కుటుంబం ఆధారపడే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు బీమా పరిహారం ఇస్తారు. శాశ్వత వైకల్యం, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారు. 51 – 70 ఏళ్ల వ్యక్తి శాశ్వత వైకల్యం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు అందుతాయి. జిల్లాలవారీగా కాల్ సెంట్లర్ నెంబర్లు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా 1800 425 5044 0894 2279748 0894 2242600 విజయనగరం జిల్లా 1800 425 5043 9701115588 0892 2228790 విశాఖపట్నం జిల్లా 1800 425 5042 9989501745 0891 2518276 తూర్పుగోదావరి జిల్లా 1800 425 5041 0884 2353111 9849901694 పశ్చిమ గోదావరి జిల్లా 1800 425 5040 0881 2222583 9701979333 కృష్ణా జిల్లా 1800 425 5039 0866 2412822 7675917702 గుంటూరు జిల్లా 1800 425 5038 0863 2241326 9959223557 ప్రకాశం జిల్లా 1800 425 5037 0859 2280598 0859 2280750 నెల్లూరు జిల్లా 1800 425 5036 9704501172 0861 2304119 చిత్తూరు జిల్లా 1800 425 5035 08572 242421 9701501411 అనంతపురం జిల్లా 1800 425 5032 08554 278275 08554 278285 కడప జిల్లా 1800 425 5033 0856 2255266 9701789687 కర్నూలు జిల్లా 1800 425 5034 08518 289222 08518 277770
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3jjPOzw
Comments
Post a Comment