నేటి నుంచి కొత్త రూల్స్.. మారే 7 అంశాలు ఇవే.. మీపై ఎఫెక్ట్!

ఆగస్ట్ నెల వెళ్లిపోయింది. సెప్టెంబర్ నెలలోకి అడుగు పెట్టేశాం. కొత్త నెల రావడంతోపాటు కొత్త రూల్స్‌ కూడా తీసుకువచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి పలు నిబంధరలు మారబోతున్నాయి. దీని వల్ల ప్రజలపై నేరుగానే ప్రభావం పడనుంది. ఆర్థిక వ్యవహారాలపై ఎఫెక్ట్ ఉండబోతోంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ దగ్గరి నుంచి లోన్ ఈఎంఐ వరకు ఏ ఏ అంశాలు మారబోతున్నాయో తెలుసుకుందాం. ✺ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా ఒకటో తేదీన మారుతూ వస్తుంది. కొన్ని సందర్భా్ల్లో ధర నిలకడగా కూడా ఉండొచ్చు. ఈ విషయం ఈరోజు తెలిసిపోతుంది. ✺ ఈరోజు నుంచి విమానంలో ప్రయాణించే వారికి ఝలక్ తగలనుంది. ప్రయాణం మరింత భారం కానుంది. ప్రయాణికుల ద్వారా అధిక ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు వసూల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై దేశీ ప్రయాణానికి ఈ ఫీజు రూ.160గా, విదేశీ ప్రయాణానికి 5.2 డాలర్లుగా ఉంటుంది. Also Read: ✺ ఆర్‌బీఐ అందించిన లోన్ మారటోరియం బెనిఫిట్ ఆగస్ట్ నెలతోనే ముగిసింది. ఇకపై లోన్ తీసుకున్న వారు వారి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ✺ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారు కూడా ఒక విషయం తెలుసుకోవాలి. మార్జిన్‌కు సంబంధించిన కొత్త రూల్స్ ఈరోజు నుంచే అమలులోకి వస్తున్నాయి. మార్జిన్ ట్రేడింగ్ చేసే వారికి ఊరట కలుగనుంది. Also Read: ✺ ఓలా, ఉబెర్ డ్రైవర్లు ధర్నా చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో ధర్నా జరుపుతామని పేర్కొన్నారు. చార్జీల పెంపు, లోన్ మారటోరియం పొడిగింపు వంటి పలు డిమాండ్ల కోసం ఈ ధర్నా చేయనున్నారు. ✺ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపులో ఆలస్యం అయితే సెప్టెంబర్ 1 నుంచి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చెల్లించాల్సిన మొత్తంపై 18 శాతం వడ్డీ పడుతుంది. ✺ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ సర్వీసులను క్రమంగా పెంచుతూ వస్తామని పేర్కొంది. ఇప్పుడు కూడా ప్రయాగ్ రాజ్, కోల్‌కతా, సూరత్‌లకు సర్వీసులు ప్రారంభించనుంది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3gL0Mwm

Comments