GHMC Elections 2020: జిహెచ్ఎంసీ తుది ఓటర్ల జాబితా విడుదల

త్వరలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వారీ ఓటర్ల జాబితాను శుక్రవారం సర్కిళ్ల వారీగా విడుదల చేసినట్లు గ్రేటర్‌ ఎన్నికల అథారిటీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని 30 సర్కిల్ కార్యాలయాలు, రెవిన్యూ కార్యాలయాలు, వార్డు కార్యాలయంలో ఓటర్ల జాబితాని సంబంధిత డిప్యూటీ కమీషనర్లు ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్ సైట్ లోనూ జాబితా ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. ఒకవేళ ఓటర్ల జాబితాలో తమ పేర్లను చెక్ చేసుకొని తమ పేర్లు లేకుంటే ఫారం 6 ద్వారా సంబంధిత అసెంబ్లీ ఎలక్టోరల్ అధికారి వద్ద ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రేటర్ లోని 150 వార్డులకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను కూడా సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. 150 వార్డులకుగాను మొత్తం 9,248 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను సంబంధిత సర్కిల్ కార్యాలయాలు, వార్డ్, ఆర్.డీ.ఓ, తహశీల్ కార్యాలయాలలో ప్రదర్శించనున్నారు. Read More: గతంలో 1,500 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ప్రతి వెయ్యి మందికి ఒకటి కేటాయించారు. దాంతో సెంటర్ల సంఖ్య 7 వేల నుంచి 9,248కి పెరిగింది. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఈ నెల 17 తేదీలోగా సమర్పించాలి. ఈ క్లెయిమ్ లను పరిశీలించి 21 .11 .2020 న సంబంధిత రిటర్నింగ్ అధికారులు తుది పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటిస్తారని పేర్కొన్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2GZ8RS4

Comments