తెల్ల రేషన్ కార్డు ఉండి కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు.. అదే ప్రమాదవశాత్తూ అయితే రూ.5లక్షలు.. శాశ్వత వైకల్యం, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం అందజేస్తారు. ఇక, 51 – 70 ఏళ్లలోపు వ్యక్తి శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణించినా బాధిత కుటుంబానికి రూ.3 లక్షల సాయం అందుతుంది. తాజాగా, ఈ పథకం లబ్దిదారులకు పరిహారం చెల్లించేందుకు పాటించాల్సిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ శుక్రవారం జీవోను విడుదల చేసింది. వైఎస్‌ఆర్ బీమా పథకంలో లబ్ధిదారులు పొందే ఏ పరిహారమైనా దరఖాస్తు అందిన ఏడు రోజుల్లోగా అందజేయాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులుగా ఉండి, సాధారణంగా మరణించిన వారు, ప్రమాదవశాత్తూ మరణించినవారు, ప్రమాదవశాత్తూ వైకల్యం పొందిన వారి కుటుంబాలకు.. పరిహారం ఇవ్వడంలో పాటించాల్సిన నిబంధనలను జీవోలో పేర్కొంది. తక్షణ సాయంగా మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10వేలు అందజేయనున్నట్టు తెలిపింది. ఈ ప్రక్రియలో గ్రామ, వార్డు వాలంటీరు, వెల్ఫేర్ అసిస్టెంట్, బ్యాంకు సిబ్బంది, జిల్లా స్థాయి వైఎస్‌ఆర్ బీమా కాల్‌సెంటర్లు, బీమా సంస్థ, డీఆర్‌డీఏ పీడీల బాధ్యతలను వివరించింది. క్లెయిమ్‌ల రిజిస్ట్రేషన్, తక్షణ సాయం, డాక్యుమెంట్ల అప్‌లోడ్, నామినీ నుంచి డాక్యుమెంట్లు సేకరించడం, ప్రమాదవశాత్తూ సంభవించిన మరణం, వైకల్యమైతే ఎఫ్‌ఐఆర్, సంబంధిత పోలీసు, వైద్యుల ధ్రువపత్రాలు జతచేయడం, వాటన్నింటినీ బ్యాంకుకు అందజేయడం, క్లెయిమ్‌ల పరిశీలన, మంజూరు, పరిహారం చెల్లించడం, ఏవైనా సమస్యలొస్తే పరిష్కరించడం వంటి పనులకు నిర్ణీత గడువును నిర్దేశించింది. నామినీలుగా భార్య, 21 ఏళ్లు నిండిన కొడుకు, పెళ్లి కాని కూతురు, వితంతువు అయిన కూతురు. ఒకవేళ Benificiarతో ఉంటే.. Benificiary మీద ఆధార పడిన తల్లిదండ్రులు.. వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు తప్ప ఇంక ఎవరిని నామినీ గా పెట్టకూడదు. Benificiaryకి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. అందులో విశిష్ట గుర్తింపు సంఖ్య (Unique Id), పాలసీ నెం. ఉంటాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2UsOz6O
Comments
Post a Comment