బంగారం కొనుగోలు చేయాలని యోచిస్తున్నారా? అయితే ఈ దీపావళి రోజున పసిడి ఆభరణాలు కొనడి. లేదంటే మీ వద్ద డబ్బులు ఉన్నప్పుడు అయినా కొనుగోలు చేయండి. బంగారం ధర ఇంకా దిగివస్తుందని భావించే వారికి మాత్రం భవిష్యత్‌లో ఝలక్ తగలనుంది. భవిష్యత్‌లో బంగారం ధర భారీగా పెరగనుంది. గత ఏడాది దీపావళి పండుగ నుంచి చూస్తే ఈ దీపావళి నాటికి బంగారం ధర ఏకంగా 29 శాతానికి పైగా పెరిగింది. వెండి ధర కూడా ఏకంగా 35 శాతానికి పైగా పరుగులు పెట్టింది. ఆగస్ట్ నెలలో బంగారం, వెండి ధరలు కొత్త గరిష్ట స్థాయిలకు చేరాయి. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. Also Read: కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ పడటంతోపాటు అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం వల్ల బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే రానున్న రోజుల్లోనూ బంగారం ధర పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, తక్కువ వడ్డీ రేట్లు, కరోనా వైరస్ ఎఫెక్ట్ వంటి పలు అంశాల కారణంగా భవిష్యత్‌లోనూ బంగారం ధర పరుగులు పెట్టొచ్చని వివరించారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ వచ్చే దీపావళి నాటికి బంగారం ధర రూ.67,000 స్థాయికి చేరొచ్చని పేర్కొంటోంది. అందువల్ల బంగారం ధర రూ.49,500- 48,500 దిశగా తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడం ఉత్తమమని సూచించింది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3puxhED
Comments
Post a Comment