బ్యాంక్ సెలవులు.. SBI, ఆంధ్రా బ్యాంకులు ఈ నెలలో ఎప్పుడెప్పుడు పని చేయవంటే?

బ్యాంక్‌ అకౌంట్ ఉందా? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్‌లకు సెలవులు ఉంటాయి. రెండు, నాలుగు శనివారాలు కాకుండా ఆది వారం రోజు బ్యాంకులు పనిచేయవు. ఇవేకాకుండా బ్యాంకు ఉద్యోగులకు మరి కొన్ని సెలవులు కూడా ఉంటాయి. అందువల్ల బ్యాంకులో పని ఉండే వారు అవి ఎప్పుడెప్పుడు పనిచేయవో ముందే తెలుసుకోవాలి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బ్యాంకులు ఎప్పుడెప్పుడు పని చేయవో ముందుగానే తెలియజేసింది. నవంబర్ నెలలో కూడా బ్యాంకులకు కొన్ని సెలవులు ఉన్నాయి. అందువల్ల మీరు మీ బ్యాంక్‌కు ఎప్పుడు సెలవులు ఉన్నాయో ముందే తెలుసుకొని వాటికి అనుగుణంగా మీ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఎప్పుడు పనిచేయవో ఇప్పుడు తెలుసుకుందాం. Also Read: వంగల ఫెస్టివల్- నవంబర్ 13దీపావళి అమావాస్య - నవంబర్ 14బలిప్రతిపాద/విక్రమ్ సంవత్ న్యూ ఇయర్- నవంబర్ 16లక్ష్మీ పూజ- నవంబర్ 18చాత్ పూజ- నవంబర్ 20, 21సెంగ్ కుత్స్‌నెమ్- నవంబర్ 23గురు నానక్ జయంతి- నవంబర్ 30 Also Read: అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ సెలవులు రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలలో బ్యాంకులకు ఎలాంటి సెలవులు లేవని చెప్పుకోవాలి. దీపావళికి సెలవు ఉన్నా కూడా ఇది రెండో శనివారం (నవంబర్ 14) రోజున వచ్చింది. అందువల్ల ఆరోజు బ్యాంకులకు ఎలాగూ సెలవే కావడంతో అదనంగా వచ్చిన సెలవు లేదని చెప్పుకోవాలి. అయితే తెలంగాణాలో నవంబర్ 30న సోమవారం కార్తీక పుర్ణిమ సందర్భంగా బ్యాంకులు పని చేయకపోవచ్చు. అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి. ఏదేమైనా ఎప్పుడైనా బ్యాంక్ సెల‌వు ఉంటే.. అప్పుడు ఆయా రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసి ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2TEcX4O

Comments