SBI డెబిట్ కార్డ్ ఉందా? ఏటీఎం నుంచి రోజుకు ఎంత డబ్బు తీసుకోవచ్చంటే?

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. వీటిల్లో ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవలు కూడా ఒక భాగమే. ఎస్‌బీఐ కస్టమర్లు వారి డెబిట్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులను ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఉపయోగించే కార్డు ప్రాతిపదికన మీరు తీసుకునే డబ్బులు లిమిట్ కూడా మారుతుంది. స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు 7 రకాల డెబిట్ కార్డులను జారీ చేస్తోంది. జూలై 1 నుంచి ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను మార్చేసింది. వీటి ప్రకారం.. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన ఎస్‌బీఐ కస్టమర్లు నెలకు 8 ఏటీఎం ట్రాన్సాక్షన్లను ఉచితంగా నిర్వహించొచ్చు. ఈ లిమిట్ దాటితే ప్రతి లావాదేవీకి చార్జీ పడుతుంది. Also Read: ఎస్‌బీఐ క్లాసిక్ అండ్ మ్యాస్ట్రో డెబిట్ కార్డు కలిగిన వారు రోజుకు రూ.20,000 ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. ఎస్‌బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉంటే రోజుకు రూ.40 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్‌బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉన్న వారు రోజుకు రూ.50,000 తీసుకోవచ్చు. ఎస్‌బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉంటే రోజుకు రూ.లక్ష మొత్తాన్ని ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్‌బీఐ ఇన్‌టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు ఉన్న వారు రోజుకు రూ.40,000 విత్‌డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఎస్‌బీఐ ముంబై మెట్రో కాంబో కార్డు ఉన్న వారు రూ.40,000 తీసుకోవచ్చు. ఇక ఎస్‌బీఐ మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు కలిగిన వారు రోజుకు రూ.40,000 ఏటఎం నుంచి విత్‌డ్రా చేయొచ్చు. అయితే రూ.10,000కు పైన ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేయాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2TM3BnT

Comments