ఐపీఎల్ 2020 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ చేతుల్లోకి వచ్చేసినా.. ఆఖర్లో చిన్న తప్పిదం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ చేజార్చుకుంది. దుబాయ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయానికి చివరి 12 బంతుల్లో 30 పరుగులు అవసరమవగా.. అప్పటికి క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా (2: 3 బంతుల్లో), శామ్ కరన్ (9: 9 బంతుల్లో 1x4) తీవ్ర ఒత్తిడితో కనిపించారు. ఈ దశలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు లూకీ ఫెర్యూసన్‌రాగా.. తొలి నాలుగు బంతుల్లో ఆ జోడీ కేవలం 7 పరుగులే రాబట్టింది. ఇందులో ఒక ఫోర్, వైడ్ కూడా ఉన్నాయి. దాంతో.. సమీకరణం 8 బంతుల్లో 23 పరుగులుగా మారిపోయింది. ఇక్కడ వరకూ మ్యాచ్ కోల్‌కతా చేతుల్లోనే ఉంది. కానీ.. 19వ ఓవర్ ఐదో బంతిని హై ఫుల్ టాస్ రూపంలో ఫెర్గూసన్ సంధించాడు. దాంతో.. ఆ బంతికి జడేజా రెండు పరుగులు రాబట్టగా.. అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత ఫ్రీహిట్ బంతిని జడేజా సిక్సర్‌గా మలిచేసి.. ఆఖరి బంతికీ ఫోర్ బాదేశాడు. దాంతో.. చివరి రెండు బంతుల్లోనే ఫెర్గూసన్ 13 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా చివరి ఓవర్‌కి సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులుగా మారిపోగా.. బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదిన జడేజా చెన్నైని గెలిపించాడు. వాస్తవానికి ఇన్నింగ్స్ 17వ ఓవర్ ముగిసే సమయానికి సమీకరణం 18 బంతుల్లో 34 పరుగులుకాగా.. 18వ ఓవర్ వేసిన పాట్ కమిన్స్ హాఫ్ సెంచరీ బాదిన రుతురాజ్ గైక్వాడ్ (72: 53 బంతుల్లో 6x4, 2x6)ని ఔట్ చేయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు. ఆ ఓవర్‌లో అద్భుతమైన యార్కర్లు సంధించిన కమిన్స్.. జడేజా- కరన్ జోడీని ఒత్తిడిలోకి నెట్టగలిగాడు. దాంతో.. తర్వాత ఓవర్‌లో ఫెర్గూసన్ యార్కర్లు సంధించే క్రమంలో లయ తప్పాడు. అతని చేతి నుంచి బంతి జారడానికి మంచు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మొత్తంగా.. ఫ్రీహిట్ బంతికి సిక్స్ తర్వాత మ్యాచ్ అనూహ్యంగా చెన్నై చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరి ఓవర్‌లో మొదటి నాలుగు బంతులకీ మూడు పరుగులే ఇచ్చిన నాగర్‌కోటి బౌలింగ్‌లో.. చివరి రెండు బంతుల్నీ జడేజా (31 నాటౌట్: 11 బంతుల్లో 2x4, 3x6) సిక్సర్లుగా మలిచేశాడు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/31YmmZI
Comments
Post a Comment