కారులో హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా ఏంటని అవాక్కవుతున్నారా. మీరు వింటున్నది నిజమే.. ఈ విచిత్రమైన పరిస్థితి విశాఖకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. హెల్మెట్ పెట్టుకోకుండా మీరు కారు నడిపారు. రూ.135 జరిమానా చెల్లించండి అంటూ విశాఖపట్నంలో ఓ కారు యజమానికి పోలీసుశాఖ ఈ-రశీదు పంపించింది. జ్ఞానాపురానికి చెందిన తుల్లి రమేష్ సెల్‌ఫోన్ మెకానిక్.. గత నెల 14న ఏపీ31క్యూ444 నంబరు కారులో మద్దిలపాలెం వైపు వెళ్లారు. తర్వాత ఆయన సెల్‌ఫోన్‌కు జరిమానా మెసేజ్ వచ్చింది.. కారు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదని అందులో ప్రస్తావించారు. తన మొబైల్‌కు వచ్చిన మేసేజ్‌లో కారు నడిపే సమయంలో హెల్మెట్ పెట్టుకోలేదని ఉండటంతో రమేష్ అవాక్కయ్యాడు. తర్వాత ఆన్‌లైన్‌లోనూ చెక్ చేసుకోగా.. హెల్మెట్ పెట్టుకోని కారణంగానే జరిమానా విధించినట్లు తేలింది. ఈ విచిత్ర పరిస్థితితో రమేష్‌కు దిమ్మ తిరిగింది. సాంకేతికపరంగా సమస్యా.. లేక పోలీసుల తప్పిదంతో ఇలా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3ei8EG5
Comments
Post a Comment