తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. వారి డబ్బు రీ ఫండ్‌కు ఛాన్స్, స్వామిని దర్శించుకోవచ్చు

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. దర్శన టికెట్ల రద్దు, రీఫండ్‌కు టీటీడీ మరో అవకాశాన్ని కల్పించింది. ఈ ఏడాది మార్చి 13 నుంచి జూన్‌ 30 వరకు ఏపీ ఆన్‌లైన్‌ కౌంటర్లు, పోస్టాఫీస్, ఈ-దర్శన్ కౌంటర్ల ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదులను బుక్‌ చేసుకున్న భక్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్‌ పొందేందుకు డిసెంబర్‌ 31 వరకు మరో అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు వాటిని ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకునే అవకాశం కల్పించారు. టికెట్‌ వివరాలు, బ్యాంక్‌ ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను ఎక్సెల్‌ ఫార్మాట్‌లో refunddesk_1@tirumala.org మెయిల్‌ ఐడీకి పంపాలి. మెయిల్ వివ‌రాల ఖ‌చ్చిత‌త్వాన్ని ప‌రిశీలించిన అనంత‌రం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేస్తారు. టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31 లోపు వారికి అనువైన సమయంలో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రెండు అవకాశాల్లో ఒకదాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ సూచించింది. మరోవైపు 2021 డైరీలు, క్యాలెండర్లను https://ift.tt/2Pu3CKJ ద్వారా కొనుగోలు చేయొచ్చని టీటీడీ తెలిపింది. అలాగే తిరుమల నాదనీరాజనం వేదికపై నవంబర్‌ 3 నుంచి ఆరో విడత సుందరకాండ అఖండ పారాయణాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరింది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/37PFGvH

Comments