ఇష్టం లేకపోయినా తప్పడం లేదు.. ఈ సినిమా భిన్నమైన అనుభవం: సూర్య

తమిళ అంటే తెలుగు ప్రేక్షకులు ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. ఆయన చేసే సినిమాలు, ఎంచుకునే పాత్రలే దానికి కారణం. హీరోగా నిలదొక్కుకుంటూనే విలక్షణమైన పాత్రలు చేస్తుంటారాయన. తాజాగా ఆయన నటించిన ‘’ సినిమా నవంబర్ 12న ఓటీటీ ద్వారా విడుదల కాబోతోంది. సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఆన్‌లైన్‌లో విలేకర్లతో ముచ్చటించారు. Also Read: ‘‘ఆకాశం నీ హద్దురా’.. లాక్‌డౌన్‌కి ముందే విడుదల కావాల్సిన సినిమా. అయితే కరోనా పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. ఈ ఆరు నెలల విజువల్‌ ఎఫెక్ట్స్‌తో చిత్రాన్ని మరింత సహజంగా తీర్చిదిద్దింది మా టీమ్. థియేటర్‌ ప్రేక్షకుల కోసమే ఈ సినిమా తీసినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావల్సి వస్తోంది. మా డైరెక్టర్ సుధ ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. కానీ నిర్మాతగా, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరి కోసం ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నా. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమా చేరువ కానుండడం సంతోషంగా ఉంది’ ‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఒక సాధారణ మనిషి, అసాధారణమైన కలల్ని కని సాకారం చేసుకున్న విధానం మా సినిమాలో చూపించాం. మనందరం తక్కువ ఖర్చుతో విమానయానం చేస్తున్నామంటే కారణం కెప్టెన్‌ గోపీనాథ్‌. ఒక స్కూల్ మాస్టర్ కొడుకైన ఆయన ఎయిర్ డెక్కన్ సంస్థను ఎలా స్థాపించగలిగారన్నది భావోద్వేగంగా చూపించగలిగాం. సుధ కొంగర స్క్రిప్టు వినిపించాక సంతృప్తి కలిగింది. సెట్స్‌పైకి వెళ్లడానికి కొన్ని నెలల ముందే ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌‌పై బాగా వర్క్ చేశాం.’ Also Read: ‘‘యువ’ సినిమా చేసేటప్పటి నుంచి సుధతో పరిచయం ఉంది. ఆ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆమె.. ఓ సన్నివేశంలో నేను బాగా నటించలేదని మొహం మీదే చెప్పేసింది. దర్శకుడు మణి రత్నంకి ఆ సీన్ నచ్చినా నాతో మళ్లీ చేయించింది. ఈ సినిమాను కూడా వాస్తవికత ఉట్టిపడేలా ఆమె ఈ తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది’. ‘గజిని’, ‘సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌’, ‘సింగం’... ఇలా అనేక సినిమాల్లో చాలా రకమైన గెటప్పుల్లో కనిపించా. ఇందులో నటించడం మాత్రం భిన్నమైన అనుభవాన్నిచ్చింది. ఒక సగటు వ్యక్తిగా, ఎయిర్‌ ఫోర్స్‌ కెప్టెన్‌గా, ఎయిర్‌లైన్స్‌ అధినేతగా ఇలా పలు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నాను. మోహన్‌బాబు గారు ఈ సినిమాకి పెద్ద బలం. ఆయన సన్నివేశాలు, తమిళ యాస విషయంలోనూ ఆసక్తిగా అడిగి తెలుసుకునేవారు. ఆయన పాత్ర గుర్తుండిపోతుంది’ అని చెప్పుకొచ్చారు సూర్య.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2TySTAO

Comments