ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. కేంద్ర బలగాలు పంపాలని విజ్ఞప్తి

నేపథ్యంలో సిద్దిపేటలో సోమవారం చోటుచేసుకున్న ఘటనలపై ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసింది బీజేపీ. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని మంగళవారం ముఖ్య ఎన్నికల అధికారి శంశాక్‌గోయల్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. దుబ్బాక ఎన్నిక పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక కోసం కేంద్రబలగాలను నియమించాలని కోరింది. ఉప ఎన్నికలో బీజేపీని దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ రామచంద్రరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిక జరిగే నియోజకవర్గం పరిధిలోకి రాని సిద్దిపేటలోని బీజేపీ అభ్యర్థి మామ, బంధువుల ఇళ్లలో ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే సోదాలు చేశారన్నారు. బండి సంజయ్‌ను సిద్దిపేటలోఅరెస్ట్ చేసి బలవంతంగా కారులోకి తోసేశారన్నారు. ఒక పోలీసు గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు కూడా బీజేపీ నాయకులు లేఖ రాశారు. అధికార యంత్రాంగం విధులను దుర్వినియోగం చేస్తుండటంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరాలని, సంజయ్‌పట్ల అనుచితంగా వ్యవహరించిన పోలీస్‌ కమిషనర్‌ను బదిలీ చేసేలా డీజీపీని ఆదేశించాలన్నారు. ఎన్నికలపై పరిశీలకులను నియమించాలని లేఖలో విన్నవించారు. మరోవైపు తనపై పోలీసుల తీరుకు నిరసనగా బండి సంజయ్ నిరసన దీక్షకు దిగారు. దీంతో ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సంజయ్‌ పట్ల పోలీసుల వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌పై చర్య తీసుకోవాలంటూ కరీంనగర్‌లో కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వివిధ జిల్లాల్లో దిష్టి బొమ్మలను దహనం చేశారు. బీజేపీ నేతలు మంగళవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయం, డీజేపీ ఆఫీసు, ప్రగతి భవన్‌ను ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. పలువురు నేతల్ని సైతం హౌస్ అరెస్ట్ చేశారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3kvm0AV

Comments