రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ భారీ షాక్.. ఆ ధరలు రెట్టింపు.. కొత్త చార్జీల విధింపు?

ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ప్యాసింజర్లకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. కరోనా వైరస్ సమయంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయాణికులపై భారం మోపేందుకు సిద్ధమౌతోంది. దీని కోసం ఇండియన్ రైల్వేస్ ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో చాలా స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.10గా ఉంది. ఇది రూ.20కు పెరగనుంది. అయితే ఇది అన్ని స్టేషన్లకు వర్తించదు. పలు స్టేషన్లకు మాత్రమే ధరల పెంపు అమలులోకి రానుంది. అంతేకాకుండా యూజర్ డెవలప్‌మెంట్ చార్జీలు వసూలుకు కూడా రంగం సిద్ధమౌతోంది. దేశవ్యాప్తంగా తొలిగా 121 స్టేషన్లలో ఈ చార్జీలు అమలులోకి రానున్నాయి. ఈ స్టేషన్లలో కూడా ప్లా్ట్‌ఫామ్ టికెట్ ధరలు పెరగనున్నాయి. Also Read: రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినోద్ కుమార్ యాద్ మాట్లాడుతూ.. దేశంలో 10 నుంచి 15 శాతం రైల్వే స్టేషన్లలో యూజర్ చార్జీలు అమలులోకి వస్తాయని గతంలోనే తెలిపారు. దేశంలో దాదాపు 7,000 వరకు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి రీడెవలప్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇండియన్ రైల్వేస్ రైల్వే స్టేషన్ల రిడెవలప్‌మెంట్ కోసం ప్రైవేట్ కంపెనీలతో జతకట్టింది. మెయింటెనెన్స్, రెనోవేషన్, డెవలప్‌మెంట్ వంటి వాటిని ఈ కంపెనీలకు అప్పగిస్తోంది. ప్రైవేట్ కంపెనీలు రూ.50 వేల కోట్లను స్టేషన్ల రీడెవలప్‌మెంట్ కోసం ఖర్చు చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, నెల్లూరు వంటి స్టేషన్లలో కూడా యూజర్ చార్జీలు అమలులోకి రానున్నాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3jFN5QE

Comments