ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ సర్కార్ దూకుడు పెంచింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాలకు ఆస్తుల విభజన.. ప్రస్తుత మౌలిక సదుపాయాలు ఏంటి.. కొత్తగా భవనాలు ఎలా సమకూర్చుకోవాలి.. అందుబాటులో ఉన్న భూములు, భవనాల నిర్మాణ విస్తీర్ణం ఎంత.. ఇలా కీలక అంశాలపై సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఆస్తులు, మౌలిక సదుపాయాలపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఈ అంశాలపై అధ్యయనం చేస్తోంది. ఇప్పుడున్న 13 జిల్లాలతో పాటు కొత్తగా ప్రతిపాదించే మరో 13 జిల్లాల్లో ఉన్న ఆస్తులు, మౌలిక సదుపాయాలపై సమాచారంపై ఫోకస్ పెట్టింది. ఈ అంశాలపై నివేదిక ఇవ్వాలని సబ్‌కమిటీకి నేతృత్వం వహిస్తోన్న ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు జిల్లా కలెక్టర్‌లు, ప్రభుత్వ శాఖల విభాగాధిపతులకు లేఖ రాశారు. వచ్చే నెల ఏడు లోగా సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఆఫీసులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు భూములే ముఖ్యం కావడంతో ప్రతిపాదిత జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ భూముల సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఖాళీ భూమి, అందులో ఉన్న భవనాల నిర్మాణ విస్తీర్ణం, లీజు ప్రతిపాదికన ప్రైవేటు భవనాల్లో ఉన్న ఆఫీసుల విస్తీర్ణం సమాచారం.. భవనాల లోకేషన్, సైట్‌ప్లాన్‌లను కూడా అందించాలన్నారు. ఇటు జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వాన ప్రభుత్వం రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లాల భౌగోళిక సరిహద్దులు, న్యాయపర మైన అంశాలు, ఆర్థికం, ఆస్తులు, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ తదితర అంశాలపై అధ్యయనానికి సీనియర్ అధికారులతో నాలుగు సబ్‌కమిటీలు ఏర్పాటైంది. కీలకమైన ఆస్తులు, మౌలిక వనరుల ఏర్పాటు కోసం సబ్‌కమిటీ-3కి ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీకి ప్రభుత్వం కీలకమైన నాలుగు బాధ్యతలు అప్పగించింది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/35K56s1
Comments
Post a Comment