చిత్తూరు జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ఏర్పేడు సమీపంలో ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. చైనాకు చెందిన జోయొంగ్ హుయి సంస్థతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.5 లక్షలతో మిషనరీ బిగించేందుకు చెంజెస్ డీల్ మాట్లాడుకున్నారు. ఫాక్స్ కంపెనీలో మిషనరీ బిగించేందుకు ఫాంగ్ చెంజెస్ అనే వ్యక్తి చైనా నుంచి ఇండియా వచ్చాడు. కంపెనీలో మిషనరీ బిగించే క్రమంలో అనవసరమైన కేబుళ్ళను చెంజెస్ కట్ చేశాడట. ఇలా చేయడంతో తమ సంస్థకు రూ.10 కోట్లు నష్టం వచ్చిందని చెంజెస్‌పై ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున మేనేజర్ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చైనా యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే కేబుళ్ళను కట్ చేశాడని.. జోయొంగ్ హుయి సంస్థ ప్రేరేపించడం వల్లనే కేబుళ్ళను కట్ చేశాడని ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆరోపిస్తోంది. రూ.5లక్షల సంగతి పక్కన పెడితే తమకు రూ.10కోట్లు నష్టం వచ్చిందని ఆ కంపెనీ చెబుతోంది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2HCfXfQ
Comments
Post a Comment