శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి పైపైకి!

నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు మాత్రం పడిపోయింది. పసిడి ధర దిగివచ్చింది. గోల్డ్ రేటు తగ్గడం కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర వెలవెలబోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.52,060కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.140 తగ్గింది. దీంతో ధర రూ.47,730కు క్షీణించింది. Also Read: బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.62,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం తగ్గుదలతో 1877 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 23.35 డాలర్లకు ఎగసింది. కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2HGvevN

Comments