పార్లమెంటు సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటు లోని అనెక్సీ భవన్‌లో గురువారం ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో అధికారులు ఆర్‌సీ తివారి, రంగారాజన్ భేటీ అయ్యారు. లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన బాలశౌరికి అధికారులు సమావేశ వివరాలను తెలిపారు. గతంలో ఈ పదవిలో నర్సాపురం ఎంపీ ఉన్నారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామ కృష్ణరాజును తప్పిస్తూ లోక్‌సభ స్పీకర్ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొంత కాలంగా తన పదవికి ఎలాంటి ఢోకా లేదని చెబుతూ వస్తున్న రఘురామకు షాక్ తగిలింది. ఆ వెంటనే నూతన చైర్మన్‌గా మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి నియమితులయ్యారు. అక్టోబర్ 9 నుంచే ఈ మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని లోక్ సభ సచివాలయం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నూతన సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీని నియమించారు. ఇందులో ఏపీకి చెందిన ఎంపీ బాలశౌరి కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. తెలంగాణకు చెందిన నామా నాగేశ్వరరావు సభ్యుడిగా కొనసాగనున్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/35K21YZ
Comments
Post a Comment