బంగారం ధర పరుగులు పెట్టింది. ఒక్కసారిగా భారీగా పెరిగింది. పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.810 పెరుగుదలతో రూ.52,220కు ఎగసింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.740 పెరిగింది. దీంతో ధర రూ.47,870కు ఎగసింది. Also Read: బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.600 పెరిగింది. దీంతో వెండి ధర రూ.62,100కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.20 శాతం తగ్గుదలతో 1908 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.58 శాతం క్షీణతతో 24.43 డాలర్లకు తగ్గింది. ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2HAiVAZ
Comments
Post a Comment