గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. వెండి రేటు ఢమాల్!

పసిడి ధర పడిపోయింది. బంగారం ధర వెలవెలబోయింది. గోల్డ్ రేటు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెట్టినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి పడిపోవడం గమనార్హం. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.100 తగ్గుదలతో రూ.51,410కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.90 తగ్గింది. దీంతో ధర రూ.47,130కు దిగొచ్చింది. Also Read: బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1000 పడిపోయింది. దీంతో Silver ధర రూ.61,500కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.17 శాతం పెరుగుదలతో 1908 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.47 శాతం పెరుగుదలతో 24.53 డాలర్లకు ఎగసింది. కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2HBNuXm

Comments