ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వారికి తీపికబురు అందించింది. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురావాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. జనవరి1 నాటికి సరల్ జీవన్ బీమా పేరుతో స్టాండర్డ్ పాలసీ తీసుకురావాలని గడువు నిర్దేశించింది. ఇన్సూరెన్స్ కంపెనీలు సింపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కస్టమర్లకు అందుబాటులో ఉంచాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది. 18 నుంచి 65 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. 4 ఏళ్ల నుంచి 40 ఏళ్ల కాల పరిమితితో ఈ ఇన్సూరెన్స్ పాలసీ పొందొచ్చు. ఇది పూర్తిగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. Also Read: అంటే పాలసీదారుడు మరణిస్తే పాలసీ డబ్బులు నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందిస్తారు. పాలసీ టర్మ్‌లో పాలసీదారుడు జీవించి ఉంటే ఎలాంటి డబ్బులు రావు. అందువల్ల ఇలాంటి పాలసీలకు ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. అయితే ఊహించని పరిస్థితుల్లో ఇంట్లో సంపాదించే వారు చనిపోతే (పాలసీదారుడు పాలసీ టర్మ్‌లో) అప్పుడు కుటుంబానికి డబ్బులు వస్తాయి. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల బీమా మొత్తం వరకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వారు రెగ్యులర్‌గా ప్రీమియం చెల్లించొచ్చు. లేదంటే 5 నుంచి 10 ఏళ్ల కాల పరిమితితో ప్రీమియం కట్టొచ్చు. లేదంటే ఒకేసారి ప్రీమియం చెల్లించొచ్చు. ఇకపోతే ఈ పాలసీకి కూడా 45 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వతనే పాలసీ వర్తిస్తుంది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/31Rt4k8
Comments
Post a Comment