ఐపీఎల్ 2020 సీజన్ ప్లేఆఫ్ రేసు ఆసక్తికరంగా మారుతోంది. టాప్-3లో ఉన్న జట్లు గత కొద్దిరోజులుగా వరుస ఓటములతో ఢీలాపడిపోతుండగా.. పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయాలతో మళ్లీ ప్లేఆఫ్ రేసులోకి వచ్చేశాయి. దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో గెలుపొందిన హైదరాబాద్ ఏడు నుంచి ఆరో స్థానానికి ఎగబాకగా.. హ్యాట్రిక్ ఓటములతో ఢిల్లీ రెండు నుంచి మూడుకి పడిపోయింది. దాంతో.. మూడో స్థానంలో ఉన్న బెంగళూరు మెరుగైన నెట్ రన్‌రేట్ సాయంతో రెండుకి ఎగబాకింది. వాస్తవానికి గత వారం రోజులుగా పాయింట్ల పట్టికలో టాప్-3లో ఉన్న ముంబయి ఇండియన్స్, బెంగళూరు, ఢిల్లీ జట్లు కేవలం ఒక మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టనున్నాయి. కానీ.. మూడు జట్లూ చివరిగా ఆడిన మ్యాచ్‌లో పేలవంగా ఓడిపోయాయి. దాంతో పంజాబ్, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు పుంజుకోగా.. ఆఖరికి ప్లేఆఫ్ ఆశలు వదిలేసిన చెన్నై కూడా బెంగళూరుకి షాకిచ్చింది. అయితే.. ఈరోజు మాత్రం ముంబయి లేదా బెంగళూరు జట్లలో ఒకటి ప్లేఆఫ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టనుంది. అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నెం.1 స్థానంలో నిలవడమే కాకుండా.. 16 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకోనుంది. ఓడిన జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లకిగానూ కనీసం ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/37OecXs
Comments
Post a Comment