సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో సునాయసంగా విజయం సాధించింది. 62 బంతుల్లో 70 రన్స్ చేసిన శుభ్‌మన్ గిల్, 29 బంతుల్లో 42 రన్స్ చేసిన ఇయాన్ మోర్గాన్.. 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించారు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో.. ఆరింటిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. దీంతో కోల్‌కతాపై టాస్ గెలిచిన వార్నర్ బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపాడు. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 142 పరుగులకే పరిమితమైంది. బర్త్ డే బాయ్ బెయిర్‌స్టోను కమిన్స్ అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. డేవిడ్ వార్నర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సన్‌రైజర్స్ 9.1 ఓవర్లలో ఓపెనర్ల వికెట్ల కోల్పోయి 59 రన్స్ చేసింది. వార్నర్ ఔటయ్యాక మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహా.. నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీతో రాణించిన మనీష్ పాండే కాస్త దూకుడుగా ఆడినప్పటికీ సాహా బంతికో పరుగు చొప్పున మాత్రమే చేయగలిగాడు. ఆఖర్లో మావి, రస్సెల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 142 పరుగులే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా ఆరంభంలోనే సునీల్ నరైన్ (0) వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడిన రాణా 26 పరుగులు చేసి ఔటవగా.. కెప్టెన్ దినేశ్ కార్తీక్ డకౌటయ్యాడు. దీంతో 6 ఓవర్లలో కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి 53 రన్స్ చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు జత కలిసిన ఇయాన్ మోర్గాన్.. కోల్‌కతాను గెలిపించాడు. సన్‌రైజర్స్ ఓటమికి కారణాలు: * సన్‌రైజర్స్ ఓటమికి ప్రధాన కారణం తక్కువ స్కోరు చేయడమే. స్కోరు బోర్డుపై మరో 30-40 పరుగులు అదనంగా ఉంటే ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది. * కోల్‌కతాపై అద్భుత బ్యాటింగ్ రికార్డు ఉన్న కెప్టెన్ డేవిడ్ వార్నర్ 36 పరుగులు చేసి కీలక తరుణంలో చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. * విజయ్ శంకర్ స్థానంలో జట్టులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా.. మనీష్ పాండేతో కలిసి నాలుగో వికెట్‌కు 61 రన్స్ జోడించినా.. అతి జాగ్రత్తతో ఆడాడు. వన్డే తరహా ఆటతీరుతో విసుగు తెప్పించాడు. చేతిలో బోలెడు వికెట్లు ఉన్నా.. ఆఖరి ఓవర్లలోనూ సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడలేకపోయారు. * నాలుగోస్థానంలో సరైన బ్యాట్స్‌మెన్ లేకపోవడం సన్‌రైజర్స్‌కు పెద్ద బలహీనతగా మారింది. * కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్.. బౌలర్లను తెలివిగా ఉపయోగించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఏడుగురితో బౌలింగ్ చేయించాడు. ఆఖర్లో రస్సెల్, మావి అద్భుతంగా బౌలింగ్ చేశారు. * సన్‌రైజర్స్ బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. స్పిన్నర్లు రషీద్ ఖాన్, నబీ పొదుపుగా బౌలింగ్ చేసినా పేసర్లు తేలిపోయారు. భువనేశ్వర్ కుమార్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఖలీల్ అహ్మద్, నటరాజన్ వికెట్లు తీసినప్పటికీ.. రన్స్ ఎక్కువగా ఇచ్చారు. * కోల్‌కతా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్ అజేయ భాగస్వామ్యాన్ని సన్‌రైజర్స్ బౌలర్స్ విడదీయలేకపోయారు. ఒత్తిడి లేకపోవడంతో.. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా ఆడారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3i0yqyI
Comments
Post a Comment