టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన వైసీపీ కార్యకర్తలు!

టీడీపీకి సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా చేశారనే ప్రచారం కలకలంరేపింది. పార్టీ తీరు నచ్చక సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుడ్ బై చెప్పారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. సీన్ కట్ చేస్తే ఆ ఎమ్మెల్యే స్పందించారు. ఇదంతా వైఎస్సార్‌సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. ‘ఇంక మిగిలింది మోడీ గారు మాత్రమే అనుకుంటా.ఇంకెందుకు లేటు ఆయన మీద కూడా వేసేయండి, వైసీపీలోకి వస్తున్నారు అని. మీరు ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మీకు 5 రూపాయిలు మాత్రమే వస్తాయి’అంటూ బుచ్చయ్య మండిపడ్డారు. కొంతమంది నెటిజన్లు, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు బుచ్చయ్య చౌదరి రాజీనామా చేశారని ట్వీట్లు చేశారు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే రాజీనామా చేశారనడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. ఈ విషయం ఆయన దృష్టికి వెళ్లడంతో స్పందించారు.. ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతు ఇచ్చారు. దీంతో మరో ఎమ్మెల్యే కూడా వెళ్లిపోతారనే ప్రచారం అలజడి రేగింది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3kVwLw5

Comments