చంద్రబాబు కొత్త టీమ్‌తో రెడీ అయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు.. భారీ మార్పులతో నేతలకు బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు.. ఈ కమిటీలను నేడు ప్రకటించనున్నారు. పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా కమిటీలను ఏర్పాటు చేశారు. గతంలో జిల్లా కమిటీలు, వాటి కింద మండల కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలు వస్తున్నాయి. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 25 కమిటీలు వేయనున్నారు. జిల్లా కమిటీల్లా వీటికి అధ్యక్షులు, పూర్తిస్థాయి కమిటీలు ఉంటాయి. ఇవి నేతల్లో ఉత్సాహాన్ని పెంచి, సంస్థాగతంగా బలపడతానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడితో పాటూ కీలక పదవుల్ని కూడా భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడితోపాటు అతనికి సహాయంగా ఇద్దరు నాయకులను కూడా నియమిస్తారు.ఈ ముగ్గురు సమన్వయ కమిటీగా ఉంటూ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఏపీతో పాటూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాలు, జాతీయ కార్యవర్గాలను చంద్రబాబు ప్రకటించనున్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/30bMtLK
Comments
Post a Comment