గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందిన కువైట్ రాజు షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబహ్ (91) అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో కువైట్ కొత్త పాలకుడిగా ఆయన సోదరుడు షేక్ నవాఫల్ అహ్మద్ అల్ జబేర్ అల్-సబహ్(83) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. షేక్ సబహ్ మారు సోదరుడైన షేక్ నవాఫ్ పరిపాలన బాధ్యతలు చేపట్టారు. షేక్ సబహ్ మృతికి నివాళిగా దేశంలో నలబై రోజుల సంతాప దినాలు ప్రకటించారు. సబా అల్ మరణించడంతో ఆయన వారసుడి ఎంపిక కోసం రాజ్యాంగ నిబంధనల ప్రకారం క్యాబినెట్ సమావేశమై జబేర్ అల్ సబహ్‌ను రాజుగా నిర్ణయించినట్టు కువైట్ డిప్యూటీ ప్రధాని మంత్రి అనాస్ ఖలీద్ అల్ సలేహ్ మీడియా ద్వారా వెల్లడించారు.షేక్ నవాఫ్ 2006 నుంచి కువైట్ యువరాజుగా కొనసాగుతున్నారు. 1937 జూన్ 25న జన్మించిన నవాఫ్.. తొలుత హవాల్లీ ప్రాంత గవర్నర్‌గానూ, తర్వాత కువైట్ రక్షణ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు పదేళ్లు మంత్రిగా పనిచేశారు. 1980 దశకంలో బీరుట్ నుంచి కువైట్ వస్తున్న బోయింగ్ విమానాన్ని జోర్డాన్లు హైజాక్ చేయగా.. దానిని చాకచక్యంగా విడిపించడంలో కీలక పాత్ర పోషించారు. విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి హాని తలపెట్టకుండా హైజాకర్లు విడిచిపెట్టారు. 1990లో నాటి ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ కువైట్‌ను ఆక్రమించుకోవడంతో ఏడు నెలల తర్వాత ఆమెరికా సాయంతో విముక్తి కలిగించడంలో కీలక పాత్ర పోషించారు. సద్దాం హుస్సేన్ ఆదేశాలను మా ప్రజలు పాటించరని, తాము ఇరాన్‌కు బానిసలం కామని నవాఫ్ ప్రకటించారు. అనంతరం అమెరికా-కువైట్ సేనలు, ఇరాక్ సైన్యంపై దాడిచేసి దేశం నుంచి తరిమివేశాయి. ఇరాక్-కువైట్ సేనల మధ్య భీకర పోరు నెలకొనగా.. 20వేల మంది సైనికులను సద్దాం హుస్సేన్ కోల్పోయారు. కేవలం 148 మంది అమెరికా సైనికులు మాత్రమే ఈ ఆపరేషన్‌లో చనిపోవడం గమనార్హం. జులై 17న కువైట్‌లో ఆయన శస్త్ర చికిత్స చేయించుకున్నారని.. తదుపరి చికిత్స కోసం జులై 19న అమెరికాలోని రోచెస్టర్‌లోని మాయో క్లినిక్‌లో చేర్పించామని తెలిపారు. అయితే.. ఆయనకు సర్జరీ ఎందుకు జరిగింది? అమెరికాలో ఎలాంటి చికిత్స తీసుకున్నారు? తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3n5dJ8l
Comments
Post a Comment