పసిడి పడిపోతూనే వస్తోంది. బంగారం ధర ఈరోజు కూడా దిగొచ్చింది. భారీగా తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం ధర తగ్గుతూ రావడం ఇది వరుసగా 4వ రోజు కావడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగిరావడంతో మన దేశంలోనూ రేట్లు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 పడిపోయింది. దీంతో ధర రూ.51,870కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.550 తగ్గింది. దీంతో ధర రూ.47,550కు దిగొచ్చింది. Also Read: పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. భారీగానే దిగొచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గింది. దీంతో వెండి ధర రూ.57,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వెండి ధర వరుసగా నాలుగు రోజులుగా పడిపోతూనే వస్తోంది. Also Read: మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.42 శాతం క్షీణతతో 1868 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.54 శాతం తగ్గుదలతో 23.08 డాలర్లకు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/330mLLZ
Comments
Post a Comment