ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి: ప్లాన్ మార్చిన చంద్రబాబు.. ఆయనకే బాధ్యతలు!

రాష్ట్ర కమిటీపై అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల్ని ఇప్పటికే ఖరారు చేయగా.. కొత్త కమిటీపై ఫోకస్ పెట్టారు. కమిటీలో కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవిపై సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా మారింది. మొదట మాజీ మంత్రి పేరు వినిపించగా.. బీద రవిచంద్రయాదవ్ పేరు కూడా తెరపైకి వచ్చింది.. దీంతో ఇద్దరిలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. దసరా నాటికి పేరు ప్రకటిస్తారనే ఊహాగానాలతో ఉత్కంఠరేపుతోంది. పార్టీలో ఇద్దరు పేర్లు వినిపిస్తున్నా.. అధ్యక్ష పదవికి అచ్చెన్నకు ఖరారైనట్లు తెలుస్తోంది. బీద రవిచంద్ర యాదవ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయనున్నారట. ఆయనకు వివిధ అనుబంధ సంఘాల్లో పని చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అనుబంధ సంఘాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడు పేరును ప్రకటించడం లాంఛనమే అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక పేర్లు పరిశీలనకు వచ్చినా.. సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు వైపు మొగ్గు చూపారట. ఆయనైతే పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇటు తెలుగు యువత పదవి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిరేపుతోంది. ఇక మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకుంటున్నారు. ప్రస్తు తం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును పార్టీ పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవాలని నిర్ణయించారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/36eKM3X

Comments