ఏపీలో ఆన్‌లైన్ గేమింగ్ చట్టంలో ప్రభుత్వం సవరణలు చేసింది.. ఆర్డినెన్స్ జారీ చేసింది. లాంటి జూద క్రీడలపై నిషేధం విధించింది. వాటిని ఎవరైనా ప్రోత్సహించినా, ఎక్కడైనా నిర్వహించినా, ఆడినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. ఈ మేరకు చట్ట సవరణ చేసింది. ఇక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చట్ట సవరణలపై ఏపీ కేబినెట్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ఆన్ లైన్ జూదాన్ని నిషేధించింది. ఆన్ లైన్లో పేకాట రమ్మీ, పోకర్ లాంటి జూదాలను నిషేధించారు. కేబినెట్‌లో ఆన్ లైన్ జూదాలపై చర్చించారు. ఆన్ లైన్ జూదం, పేకాటలను నిషేధిస్తూ గేమింగ్ చట్టంలో సవరణల్ని ఆమోదించారు. ఆన్ లైన్లో ఎవరైతే రమ్మీ, పోకర్ లాంటి జూదాన్ని నిర్వహించే వారికి జరిమానా, శిక్ష విధిస్తారు. దీనికి సంబంధించి జీవో జారీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఆన్ లైన్ రమ్మీ, పోకర్ నిర్వహించే వారు మొదటిసారి పట్టుబడితే వారికి ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఒకవేళ రెండో సారి కూడా పట్టుబడితే వారికి రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. అలాగే, ఆన్ లైన్లో జూదం ఆడేవారికి కూడా ఆరు నెలల శిక్ష పడుతుంది. కొందరు డబ్బు కోసం ఆన్ లైన్ పేకాట నిర్వహిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని.. ఇటీవల చాలామంది ఇలాగే డబ్బు పోగొట్టుకుంటున్నారని కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. దీంతో జూదాలపై నిషేధం విధించారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/369hPGw
Comments
Post a Comment