తెలంగాణకు మరో మూడు రోజుల పాటు భారీ నుంచి పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో సోమ, మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆదివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంలో తీవ్రత ఎక్కువగా గ్రేటర్ పరిధిలోనే ఉందని, అందుకే ఈ నెలలో ఆ ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. అయితే నైరుతి రుతుపవనాలు చివరి దశలోనూ బాగా ప్రభావం చూపుతున్నాయి. మరో 20 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నప్పటికీ రెండు ఉపరితల ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పదేళ్ల రికార్డును బద్దల కొట్టాయి. ఇప్పటివరకు దాదాపు 46 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 2010లో 32 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. Read More: హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారిక లెక్కల ప్రకారం జూన్ 1 నుంచి శనివారం వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 742.1 మిల్లీమీటర్లు కాగా, ఈ సారి ఏకంగా 1,082.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 23 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్‌లోనూ 30 శాతం అధిక వర్షపాతం నమోదైంది
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/36nFfZ9
Comments
Post a Comment