దేశీ దిగ్గజ టెలికం కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ జియో తాజాగా తన కస్టమర్లకు కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. విమానాల్లోనూ తన సేవలను లాంచ్ చేసింది. దీంతో ఇకపై విమానాల్లో ప్రయాణించే వారు కూడా ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. 22 అంతర్జాతీయ విమాన రూట్లలో జియో ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. జియో కస్టమర్లకు కోసం కంపెనీ ఈ ఫ్లైట్ సర్వీసుల కోసం కొత్త ప్లాన్లను కూడా తీసుకువచ్చింది. ప్లాన్ ధర రూ.499 నుంచి ప్రారంభమౌతోంది. దీంతో దేశంలో ఫ్లైట్ సేవలు అందించే తొలి మొబైల్ ప్రొవైడర్‌గా జియో కంపెనీ అవతరించింది. దీని కోసం కంపెనీ ఏరోమొబైల్ సంస్థతో జతకట్టింది. Also Read: వర్జిన్ అట్లాంటిక్, స్విస్, ఎమిరేట్స్, ఈథిహద్ ఎయిర్‌వేస్, యూరో వింగ్స్, లుఫ్తానా, మలిందో ఎయిర్, బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్, అలిటలియా వంటి కంపెనీలో రిలయన్స్ జియో జతకట్టింది. ఈ విషయాన్ని జియో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. రూ.499 ప్లాన్ కొనుగోలు చేస్తే 100 నిమిషాల ఔట్ గోయింట్ కాల్స్ చేసుకోవచ్చు. 250 ఎంబీ మొబైల్ డేటా వస్తుంది. ఇన్‌కమింగ్ కాల్స్ రావు. రూ.699 ప్లాన్‌తో 100 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు. 500 ఎంబీ వస్తుంది. ఇన్‌కమింగ్ కాల్స్ రావు. ఇక రూ.999 ప్లాన్‌తో 1 జీబీ డేటా వస్తుంది. 100 నిమిషాలపాటు ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. ఇన్‌కమింగ్ కాల్స్ రావు. ఇక ఈ ప్లాన్స్ అన్నింటిపైనా 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/304FTqe
Comments
Post a Comment