చత్తీస్‌గఢ్‌లో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రయాణికులతో వెళ్తోన్న వ్యాన్‌ను భారీ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రాయగఢ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వేగంగా వస్తున్న లారీ వ్యాన్‌ను బలంగా ఢీకొనడంతో వాహనం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాటిని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవరు పరారీలో ఉన్నాడని రాయగఢ్ జిల్లా ఎస్సీ సంతోష్ సింగ్ తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు వివరించారు. అతివేగంతో వాహనం నడిపి ఎదురుగా వస్తోన్న వ్యాన్‌ను ఢీకొట్టాడని పేర్కొన్నారు. వ్యాన్‌ను బలంగా ఢీకొట్టడంతో మొత్తం నుజ్జునుజ్జయ్యి మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయని అన్నారు. అతికష్టంతో వాటిని బయటకు తీశారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3ippR0I
Comments
Post a Comment