ఏపీలో మందుబాబులకు ఓ శుభవార్త.. మరో బ్యాడ్ న్యూస్

ఏపీలో మందబాబులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా మద్యం మాల్స్‌ రానున్నాయి. వాక్‌ ఇన్‌ షాప్స్‌ పేరిట వీటిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 50-100 వరకు ఇలాంటి మాల్స్‌ను ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) వీటిని నిర్వహిస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 2020-21కి నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి 2021 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. నూతన పాలసీ ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో కొన్ని రకాల బ్రాండ్లే ఉంటున్నాయి. తాజాగా ఏర్పాటు చేయనున్న ఈ వాక్‌ ఇన్‌ షాప్స్‌లో అన్ని బ్రాండ్లూ ఉంచాలని ఏపీఎస్‌బీసీఎల్‌ ఆలోచన చేస్తోంది. ఈ వాక్ ఇన్ షాప్స్ ఉండేచోట ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల్ని తొలగిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2,934కు మించకుండా మద్యం దుకాణాలు ఉండేలా చూస్తారు. గతేడాది అక్టోబరు 1న ప్రభుత్వ ఆధ్వర్యంలో 3,500 మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మే 9న వీటిని 2,934కు కుదించారు. 2020-21కి సంబంధించి షాపులు అంతే సంఖ్యలో కొనసాగుతాయి. నూతన పాలసీలో షాపుల సంఖ్యను తగ్గించలేదు. ఇక తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి అలిపిరి వరకూ ఆర్టీసీ బస్టాండు, లీలామహల్‌ సర్కిల్‌, నంది సర్కిల్‌, విష్ణు నివాసం, శ్రీనివాసం, ఎస్‌వీఆర్‌ఆర్‌ ఆసుపత్రి, స్విమ్స్‌ ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతించరు. ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానాన్ని పాటిస్తారు. రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. లాక్ డౌన్ తర్వాత మద్యం దుకాణాలు తెరిచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం మద్యం ధరలను పెంచింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి అక్రమ మద్యం రవాణా పెరిగింది. నిఘా పెట్టినా, ప్రత్యేక విభాగం (SEB) ఏర్పాటు చేసినా సరే రవాణా కొనసాగుతోంది. ఇటీవలే హైకోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల్లో మార్పులు చేసింది. క్వార్టర్ మద్యం ధర రూ.150 కంటే తక్కువ ఉంటే వాటి ధరలను తగ్గించింది. క్వార్టర్ (180 ఎంఎల్) మద్యం ధర రూ.190 కంటే ఎక్కువ ఉంటే వాటి ధరలను పెంచింది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/33Zheoi

Comments