ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుందంటారు పెద్దలు. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత టీడీపీకి, అధినేత చంద్రబాబుకు ఆ విషయమే తెలిసొచ్చినట్లుంది. ఈ మధ్య గేరు మార్చారు.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గమనించి ముందుకు సాగుతున్నారు. పార్టీ, కార్యకర్తల్ని అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేశానని ఒప్పుకుంటున్నారు.. మళ్లీ ఆ పొరపాటు చేయనని చెబుతున్నారు. పార్టీ నేతలు, పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన... పదే, పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తానని చంద్రబాబు అంటున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో మాట్లాడిన ఆయన.. పార్టీ అధికారంలో లేదని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని.. రానున్న రోజుల్లో యువతకు పార్టీలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తాను అంటున్నారు.. ప్రభుత్వ అసమర్థ పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నాయకత్వం కృషి చేయాలని సూచించారు. అంతేకాదు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల ఎంపికలో కూడా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశామన్నారట. ఇటీవల పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఎమోషన్ అయ్యారట. పార్టీలో నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు, నేతల గురించి ప్రస్తావన రాగానే.. ఒకరు పార్టీని వీడితే వంద మంది లీడర్లను తయారు చేస్తాను అని వ్యాఖ్యానించారట. ఓ ఫ్యాక్టరీ ఒకరు పోతే వందమందిని తయారుచేసే సత్తా ఉన్నపార్టీ.. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అన్నారట. ఏ నేరం చేయకపోయినా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పార్టీకి ప్రాధాన్యం ఇస్తానని పదే, పదే చెబుతున్నా.. కార్యకర్తలు మాత్రం ఆ విషయాన్ని ఆచరణలో కూడా పెడితే బావుటుందనే అభిప్రాయాన్ని చెబుతున్నారట. పార్టీలో తొలి నుంచి పనిచేస్తున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని.. వలస నేతల్ని ప్రోత్సహించడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇకనైనా పార్టీని బలోపేతం చేసి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3leA9Td
Comments
Post a Comment