చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జ్ పదవిని భర్తీ చేసింది అధిష్టానం. ఎన్నో సమాలోచనల తర్వాత పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అర్జునుడు త్వరలోనే నియోజకవర్గ నేతలతో సమావేశంకానున్నారు.. పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ఎవరూ ఊహించని విధంగా అర్జునుడికి బాధ్యతలు అప్పగించి చంద్రబాబు ఒకింత ఆశ్చర్యపరిచారనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ మోహన్ విజయం సాధించారు. కొద్ది రోజులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అధికార పార్టీకి మద్దతు ఇచ్చారు. ఆ వెంటనే టీడీపీ నుంచి వల్లభనేని వంశీని సస్పెండ్ చేశారు. వంశీ కూడా అసెంబ్లీలో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరగా.. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. తర్వాత టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. గన్నవరం టీడీపీకి కంచుకోటలా ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత టీడీపీ సత్తా చాటుతోంది. 2009 వరకు ఈ నియోజకవర్గం నుండి టీడీపీ నేత దాసరి బాలవర్ధన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో దాసరి బాలవర్ధన్ రావును పక్కన పెట్టి వల్లభనేని వంశీకి చంద్రబాబు టిక్కెట్టు కేటాయించారు. రెండుసార్లు ఆయన విజయం సాధించారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/36a1xgI
Comments
Post a Comment