మనదేశంలో మూఢనమ్మకాలకు, అంధవిశ్వసాలకు కొదవలేదు. అందుకే బాబాలు, స్వామిజీల చుట్టూ ఈ 2020లో కూడా జనం చక్కర్లు కొడుతున్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా.. ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా కొందరు.. దొంగ బాబాల్ని నమ్మి నట్టేట మునుగుతున్నారు. తాజాగా ఓ కుటుంబం ఇలాంటి పూజల పేరుతోనే.. లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుంది వివారాల్లోకి వెళ్తే.. ఓ మహిళ భర్త చనిపోయాడు. ఇద్దరు కూతుళ్లను చదివించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. దీంతో వారికి రమేష్ అనే ఓ 43 ఏళ్ల వ్యక్తి పరిచయం అయ్యాడు. కుటుంబ భారం అంతా తల్లి మొస్తుండగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి పూజలు చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మబలికి నెమ్మదిగా తన ఉచ్చులోకి దింపాడు. ఎవరో ఎందుకు నేనేే పూజలు చేస్తా అన్నాడు. అలా రెండేళ్లుగా వారింట్లో పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో అతడి కన్ను 17 ఏళ్ల పెద్ద కుమార్తపై పడింది. 2018లో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పూజ చేసేందుకు వచ్చిన రమేష్ ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. Read More: ఇది ఇలా ఉండగా ఇప్పుడు వాళ్ళ కుటుంబం కొంచెం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడడంతో తన పూజల వల్ల మీరు బయట పడ్డారు అంటూ మైనర్ ని లో లోపర్చుకోవడానికి చూశాడు . తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి కూడా తెచ్చాడు. దీనికి మైనర్ ఒప్పుకోకపోవడంతో తాను పూజలు చేసి కుటుంబాన్ని నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో జరిగిన విషయం మైనర్ తన తల్లికి చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2FrKyuX
Comments
Post a Comment