బాధితులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే డబ్బులు చెల్లించనున్నట్టు ఏపీ సీఐడీ ప్రభుత్వం తరపున ప్రకటించింది. డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించాలని ఏపీ హైకోర్టు నుంచి ఉత్తర్వులు రాగానే డబ్బులు చెల్లిస్తామని తెలిపింది. రూ.20 వేల డిపాజిట్ చేసిన వారికి చెల్లించనున్నట్టు తెలిపింది. సీఐడీ పది వేల రూపాయాలు డిపాజిట్లు చేసిన వారికి సైతం డబ్బులు అందకపోతే వారికి కూడా రూ.20 వేల డిపాజిట్లు చెల్లించినప్పుడు చెల్లిస్తామని ప్రకటించింది. అగ్రి గోల్డ్‌లో రూ. 10వేలు డిపాజిట్ చేసిన వారు సుమారు 3 లక్షల 59వేల 655 మంది ఉంటారని సీఐడీ నివేదికలో ఉంది. అగ్రిగోల్డ్‌పై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే కొంత మంది డిపాజిట్ దారులకు డిపాజిట్లను చెల్లించారు.. రెండో విడతలో ఇతర డిపాజిట్ దారులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. మొత్తం రూ. 1150 కోట్ల రూపాయలు బాధితులకు చెల్లించడం కోసం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వం ఇప్పటికే రూ.10వేల డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించింది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/30bJN0H
Comments
Post a Comment