చంద్రబాబుకు షాకిచ్చిన జగన్ సర్కార్.. మళ్లీ నోటీసులు

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా నది వరద 5 లక్షల క్యూసెక్కులకు పెరగడంతో ఈ నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు ఇంటితో పాటూ కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు కూడా నోటీసులు ఇచ్చారు. వరద పెరుగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని.. ఇళ్లల్లో ఎవరూ ఉండొద్దని సూచించారు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. కొద్దిరోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తుండటం వలన కృష్ణా నదికి వరద పోటెత్తింది. కృష్ణా నదిలో వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో నీటిని కిందకు వదులుతున్నారు. ఈ వరద ప్రవాహంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. వరద ఉదృతి రోజు రోజుకు పెరుగుతుండటంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలకు ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందుకే చంద్రబాబుతో పాటూ కరకట్టపై ఉన్న ఇళ్లు, ఇతర భవనాలకు నోటీసులు ఇస్తున్నారు. గతేడాది కూడా భారీ వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరిగింది. అప్పుడు కూడా చంద్రబాబుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలని కోరారు.. ఈ వ్యవహారంపై అప్పట్లో రాజకీయంగా దుమారం రేగింది. ఉద్దేశపూర్వకంగానే ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసేసి వరద పెరిగేలా చేసి.. ఉండే ఇల్లు మునిగేలా చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3i9mHOv

Comments