ఏపీలో ప్రభుత్వ లెక్చరర్లకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. కొంతకాలంగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. వారికి 12 నెలల జీతం ఇవ్వాలని నిర్ణయించారు. కాలేజీల అధ్యాపకుల వినతి మేరకు 10 నెలల జీతాన్ని 12 నెలలకు పెంచుతూ ఆయన ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ, ప్రైవేట్ ఓరియంటల్.. ప్రభుత్వ ఓకేషనల్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇది వర్తించనుంది. సీఎం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 5,042 మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. గతంలో లెక్చరర్లకు 10 నెలల జీతం మాత్రమే ఇచ్చేవారు. అయితే వారు తమకు 12 జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించడంతో వారి సమస్య పరిష్కారమైంది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/36dVyHx
Comments
Post a Comment