మన సీతాకోక చిలుకకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశం దొరికింది. ఈ రేసులో దేశవ్యాప్తంగా రంగు రంగుల సీతాకోక చిలుకలు పోటీ పడుతున్నాయి. వీగిలో ఏపీ నుంచి మూడు రకాల సీతాకోక చిలుకలు కూడా బరిలో ఉన్నాయి. ఏపీతో పాటూ మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ పోటీలో నిలిచాయి. జాతీయ స్థాయి ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేయడానికి జరుగుతోన్న ఫైనల్ పోటీలో మొత్తం 7 రకాలు ఎంపిక కాగా.. వీటిలో పాపికొండల అభయారణ్యంలో ఉండే మూడు రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. 2021కి సంబంధించి జరుగుతున్న ఈ పోటీలో కామన్ జేజేబెల్, ఆరెంజ్ ఓకలీఫ్, కామన్ నవాబ్, కృష్ణ పీకాక్, ఫైవబర్ స్వోర్డ్ టైల్, నార్తన్ జంగిల్ క్వీన్, ఎల్లో గోర్గాన్‌లు జాతులు ఎంపికయ్యాయి. వీటిలో ఈ పశ్చిమగోదావరి జిల్లా పాపికొండల అభయారణ్యంలోని ఉండే కామన్ జేజేబెల్, ఆరెంజ్ ఓకలీఫ్, కామన్ నవాబ్‌లు ఉన్నాయి. ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేసేందుకు ఆన్‌లైన్ ఓటింగ్‌ను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 8 వరకు ఆన్‌లైన్ ఓటింగ్ జరగనుంది. ఓటు వేయాలనుకుంటే https://ift.tt/3iysjmm ద్వారా ఓటు వేయొచ్చు. ఈ ఓటింగ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చు. దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళలు ఇప్పటికే రాష్ట్ర సీతాకోక చిలుకల్ని ప్రకటించారు. తర్వాత 2015లో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ కూడా ప్రకటించింది. మహారాష్ట్ర బ్లూ మోర్మాన్‌ను రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటిస్తే.. ఉత్తరాఖండ్ పీకాక్‌ను ఎంపిక చేసింది. కర్ణాటక బర్డ్ వింగ్స్, కేరళ మలబార్ బాండెడ్ పీకాక్, తమిళనాడు తమిళ యేమెన్‌ను తమ రాష్ట్ర సీతాకోక చిలుకలుగా ప్రకటించారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3i2ssND
Comments
Post a Comment