మాజీ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో పలువురు అనుమానితుల్ని పిలిచి ప్రశ్నిస్తున్నారు.. కీలక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. అధికారులు గురువారం కూడా పులివెందులకు చెందిన చెప్పుల షాపు యజమాని మున్నాని ప్రశ్నించారు. బ్యాంకు లాకరులో ఉన్న రూ.48 లక్షల డబ్బు, 25 తులాల బంగారు నగలను మున్నా ఎలా సంపాదించారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. మున్నాతో పాటూ పులివెందులకు చెందిన మరో ఆరుగురిని ప్రశ్నించారు.. వీరిలో చంటి అనే హిజ్రా కూడా ఉన్నారు. వీరందరి నుంచి కీలకమైన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణకు హాజరైన వారిలో మున్నా సన్నిహితులు ఉన్నట్లు సమాచారం. పులివెందులలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉన్న సీబీఐ అధికారులు.. మున్నా, వివేకా సన్నిహితుల ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక కోర్టు తిరస్కరించిన పిటిషన్‌ను పులివెందులలో ఉన్న మరో సీబీఐ బృందం గురువారం వెనక్కి తీసుకుంది. ఇటు సీబీఐ అధికారులు గురువారం కడపలో విచారణకు హాజరైన ట్యాంకరు భాషాను మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి బయట గంటపాటు పరిసరాలను పరిశీలించారు. హత్య జరిగిన రోజు జరిగిన విషయాలపై భాషాను ప్రశ్నించారు. వివేకా ఇంటిలో భాషా పనిచేసేవారు.. వివేకా హత్య జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నట్లు తెలిసింది. వివేకా హత్యకు పాల్పడిన వ్యక్తులు ఏ వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించారనే విషయమై భాషాను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు బుధవారం ఉదయ్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు పిలిపించారు.. అతడ్ని కూడా ప్రశ్నించారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/33SlZjo
Comments
Post a Comment