గుడ్ న్యూస్.. 2 నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం ధర.. ఏకంగా రూ.7,000 పతనం!

పసిడి పడిపోతూనే వస్తోంది. ఆగస్ట్ నెలలో కొత్త గరిష్ట స్థాయిలకు చేరిన బంగారం ధర అక్కడి నుంచి తగ్గుతూనే వస్తోంది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.49,500 వద్ద కదలాడుతోంది. ఆగస్ట్ 7న బంగారం ధర ఏకంగా రూ.56,200 స్థాయికి పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. బంగారం ధర మాత్రమే కాకుండా వెండి ధర కూడా ఇదే దారిలో నడుస్తోంది. వెండి ధర ఆగస్ట్ నెలలో కేజీకి ఏకంగా రూ.80,000 స్థాయికి చేరింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వెండి ధర రూ.58,000 వద్ద కదలాడుతోంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కాలంలో బంగారం ధర ఏకంగా 10 శాతం మేర పతనమైంది. ఇటీవల బంగారం ధర ఔన్స్‌ను 2075 డాలర్లకు ఎగసింది. అయితే ఇప్పుడు 1860 డాలర్ల వద్ద కదలాడుతోంది. Also Read: గ్లోబల్ మార్కెట్‌లో 2020 ఇప్పటి దాకా చూస్తే బంగారం ధర ఇంకా 20 శాతానికి పైగా పైస్థాయిలోనే ఉంది. తక్కువ వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉండటం వంటి అంశాలు బంగారం ధరకు మద్దతునిస్తున్నాయి. అదేసమయంలో ఈక్విటీ మార్కెట్లు పెరుగుతుండటంతో పసిడికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. బంగారం ధరకు 1820 వద్ద బలమైన మద్దతు ఉందని మార్కెట్ వర్గాల పేర్కొంటున్నాయి. వెండి ధర ఇటీవల గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 25 శాతం పతనమైంది. అయినా కూడా ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటం, సోలార్ ప్యానెల్స్‌ను డిమాండ్ ఉండటం, చైనా నుంచి వెండి దిగుమతులు పెరగడం వంటి వాటి వల్ల వెండి కూడా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే బంగారం ధర వచ్చే ఏడాది మార్చి నాటికి 2500 డాలర్ల స్థాయికిచేరొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ పేర్కొంటోంది. అంటే రానున్న రోజుల్లో పసిడి పరుగు తప్పదు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/36kuG95

Comments