టీడీపీకి మరో షాక్ తగిలింది.. అనుకున్నదే జరిగింది. ఆ పార్టీ నేత చలమలశెట్టి సుమన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు. సునీల్‌కు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట పలువురు అనుచరులు కూడా మళ్లీ తిరిగి సొంతగూటికి చేరారు. సునీల్ చాలా రోజులుగా పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా ఆలస్యమవుతుందని అందరూ భావించారు.. కానీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ లాంఛనం పూర్తయ్యింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎంపీ వంగా గీత ఇతర నేతలు పాల్గొన్నారు. సునీల్ మూడుసార్లు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం తరపున.. 2014లో వైఎస్సార్‌సీపీ.. 2019లో నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే కొద్దిరోజులుగా ఆయన వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మూడుసార్లు, మూడు పార్టీలు మారినా ఆయన ఎంపీ ముచ్చట మాత్రం తీరలేదు.. మూడుసార్లు ఆయనకు ఓటమి ఎదురైంది. ఆర్థికంగా, స్థానికంగా బలమైన నేతగా ఉన్నా నిరాశే ఎదురవుతోంది. ఈసారైనా సునీల్‌కు జగన్ ఆ అవకాశం ఇస్తారని.. రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. సునీల్ రాకకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు కలిసి పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సునీల్ టీడీపీకి గుడ్ బై జనసేనలో చేరి మళ్లీ పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. పోనీ టీడీపీలో కొనసాగి మళ్లీ పోటీచేసే ఛాన్స్ ఉంది. సునీల్‌ను వైఎస్సార్‌సీపీలోకి తీసుకొస్తే అక్కడ ప్రత్యర్థులకు చెక్ పెట్టొచ్చనే భావనలో అధిష్టానం ఉందట. అంతేకాదు సునీల్ కాపు సామాజిక వర్గం కావడంతో స్థానికంగా కూడా పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారట.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3gQivlL
Comments
Post a Comment