పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్ ధర ఈరోజు స్థిరంగానే కొనసాగింది. ఇక ఎప్పటిలాగే నిలకడగానే ఉంది. దీంతో హైదరాబాద్లో శనివారం లీటరు పెట్రోల్ ధర రూ.85.15 వద్ద, డీజిల్ ధర రూ.80.17 వద్ద నిలకడగా కొనసాగాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.86.72 వద్ద స్థిరంగా కొనసాగింది. డీజిల్ ధర రూ.81.32 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.86.28 వద్ద నిలకడగా ఉంది. డీజిల్ ధర రూ.80.91 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర స్థిరంగా రూ.81.94 వద్దనే ఉంది. డీజిల్ ధర నిలకడగా రూ.73.56 వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.88.58 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.80.11 వద్ద నిలకడగా ఉంది. Also Read: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.59 శాతం పెరుగుదలతో 45.87 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.19 శాతం క్షీణతతో 42.96 డాలర్లకు తగ్గింది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2YJ8v7T
Comments
Post a Comment