బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండిదీ ఇదే దారి!

తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. పసిడి ధర పరుగులు పెట్టింది. బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యా్డ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లోనూ పసిడి పైకి కదలడం గమనార్హం. పసిడి ధర పెరిగితే కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.54,040కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.410 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,540కు ఎగసింది. Also Read: పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.240 పెరిగింది. దీంతో ధర రూ.66,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.15 శాతం తగ్గుదలతో 1975 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.45 శాతం తగ్గుదలతో 28.46 డాలర్లకు దిగొచ్చింది. ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3lD9nVx

Comments