విశాఖలో యువ ఎస్సై ఆత్మహత్య.. బర్త్ డే ముందే రోజే విషాదం!

విశాఖపట్నంలో ఓ యువ ఎస్సై ఆత్మహత్య కలకలంరేపింది. కాపులుప్పాడ గ్రేహౌండ్స్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న షణ్ముఖరావు తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అనారోగ్య కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఆత్మహత్యకు అనారోగ్య మే కారణమా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల్ని అడిగి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఎస్సై షణ్ముఖరావుది శ్రీకాకుళం జిల్లాకాగా.. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2YMrkad

Comments