కరోనా మహమ్మారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. సాఫీగా సాగిపోతున్న జీవితాలను కోలుకోలేని దెబ్బ కొడుతోంది. వరుసగా జరుగుతున్న ఘటనలు అందర్నీ కలవరపెడుతున్నాయి. కరోనా భయంతో కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే.. మరికొందరు మానసికంగా సమస్యల్ని ఎదుర్కుంటున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఓ ఘటన జరిగింది. కుమారుడికి కరోనా సోకిందన్న ఆవేదనతో ఓ తండ్రి మతిస్థిమితం కోల్పోయాడు. జిల్లాలోని తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన తండ్రీకొడుకులకు ఇటీవల కరోనా పరీక్షలు చేశారు. కుమారుడి పాజిటివ్ రావడంతో తాడేపల్లిగూడెం కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలించారు. కుమారుడ్ని చూసి తండ్రి ఆవేదనకు గురయ్యాడు.. ఆయన హృదయం తల్లడిల్లింది. కొడుకు కోసం తీవ్ర భావోద్వేగానికి గురై మతిస్థిమితం కోల్పోయాడు. ఒంటిపై దుస్తులు తీసేసి ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. కరోనా భయంతో ఇరుగు, పొరుగు వారెవరూ దగ్గరకు రాలేదు.. అధికారులు ఆ వృద్ధుడిని ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి తరలించారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2QuaSa8
Comments
Post a Comment