విశాఖలో బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బంకర్.. దీని వెనుక పెద్ద కథే ఉంది

విశాఖపట్నంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బంకర్ ఒకటి బయటపడింది. కేఆర్ బీచ్‌లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి కాంక్రీట్ బంకర్ బయటపడింది. జపాన్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ పిల్‌ బాక్సులను ఏర్పాటు చేసిందట. రెండో ప్రపంచ యుద్ధంలో సముద్రపు గుండా వచ్చే శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్‌లను నిర్మించుకుని అక్కడినుంచి దాడులకు దిగినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. ఓసారి హార్బర్‌‌పై జపాన్ బాంబు దాడి చేసిందని చరిత్ర కూడా చెబుతుండటంతో ఈ బంకర్ అప్పటిదే అని అధికారులు భావిస్తున్నారు. ప్రాచీన నాగరికతకు ఆనవాలుగా చెప్పుకునే ఈ బంకర్ బయటపడడంతో.. అలాగే వెరైటీగా ఓ గుహలాగా ఉండటంతో దానిని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. ఓవైపు సముద్రం అందాలు.. మరోవైపు ఈ బంకర్ పక్కన ఫోటోలు తీసుకుంటున్నారు. బంకర్ ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/31D65JJ

Comments