అమరావతి ప్రాంతలో కీలక నియోజకవర్గమైన తాడికొండ. అక్కడ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. రైతులు, మహిళలు రోజూ రోడ్డెక్కుతున్నారు. ఈ అసమ్మతిని చల్లార్చేందుకు వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చింది.. అక్కడ రైతుల్ని, స్థానికుల్ని కాస్త శాంతపరిచేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అమల్లోకి తీసుకొచ్చారు. అమరావతిలో కీలకమైన తుళ్లూరులోనే వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. శ్రీదేవి పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. రాజధాని ఇక్కడే ఉండాలని రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో ఇక్కడ ఆఫీస్ ప్రారంభించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముందు ఎమ్మెల్యే పర్యటనను కొందరు ఎమ్మెల్యేను అడ్డుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి గొడవ లేకుండానే.. ఈ కార్యక్రమం సజావుగానే సాగింది. వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభించడంతో పాటూ అమరావతి రైతులకు కౌలు చెల్లించినందుకు శ్రీదేవి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం కూడా చేశారు. రైతులు, రైతు కూలీల ముసుగులో కొందరు టీడీపీ ధర్నాలు చేస్తోందని.. CRDA రద్దు జరిగినా.. ప్రభుత్వం మాత్రం కౌలు డబ్బులను, పెన్షన్‌ను అందిచిందన్నారు. శ్రీదేవి అమలు చేసిన వ్యూహం ఓ విధంగా సక్సెస్ అయినట్లే చెప్పాలి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2QylzIT
Comments
Post a Comment